తెలంగాణకు వెయ్యి టీఎంసీలు చాలు అంటే… నీ తాత జాగీరా రేవంత్ రెడ్డి!: డా. దాసోజు శ్రవణ్ మండిపాటు

  • “మోడీకి నజరానా –
    తెలంగాణకు ద్రోహమా?”
  • “గోదావరి నీళ్లు
    చంద్రబాబుకి గిఫ్టా?”
  • “పొట్టిగా ఉంటే సీఎం కాలేవా? బాడీ షేమింగ్‌పై రివర్స్ పంచ్!”
  • “చర్చకు దమ్ముంటే రా రేవంత్!”
  • “మిడిమిడి జ్ఞానం… మిడతలా!”
  • “పద్దెనిమిది నెలల్లో ఒక పని చూపిస్తే… గుండు కొట్టించుకుంటా!”
  • “రాష్ట్ర హక్కులపై వెన్నుపోటు వేస్తున్న రేవంత్!”
  • “బీహార్‌కో మోడీ…
    తెలంగాణకో బాబు?”
  • “జలహక్కుల కోసం
    కేసీఆర్ పోరాటం –
    రేవంత్‌కు మునిమాటలు!”

హైదరాబాద్‌, జూన్ 21 (విశ్వం న్యూస్): తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జి.దేవి ప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, రాంచంద్ర నాయక్‌లు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడిన శ్రవణ్ విమర్శలు తీవ్రంగా మారాయి.

“పచ్చి అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నరనరాన విషం నింపుతున్నాడు. మిడిమిడి జ్ఞానం తో మిడతలా ఎగిసి పడుతున్నాడు. తెలంగాణకు శాపంలా మారాడు రేవంత్ రెడ్డి,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మోడీని నొప్పించకుండా, చంద్రబాబును మెప్పించేందుకు ముందుకు సాగుతున్న ధోరణి దురదృష్టకరం” అన్నారు. “తెలంగాణ ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై విధేయతతో వ్యవహరిస్తున్న రేవంత్, కోడంగల్ ఫార్మ్‌హౌస్‌లో గుడి కట్టుకోవచ్చు కానీ, రాష్ట్ర హక్కుల విషయంలో వెన్నువేసి మాట్లాడొద్దు” అని హెచ్చరించారు.

గోదావరి – కృష్ణా జలాల అంశంపై అసలు వాస్తవాలు:
కేసీఆర్ హయాంలో 86% భూమి సాగుకిష్టమైంది – రేవంత్ హయాంలో అది తగ్గిందని ఆరోపించారు. “గోదావరిలో మనకు హక్కుగా ఉన్న 968 టీఎంసీలకు తోడు 1950 టీఎంసీలు కావాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. కానీ రేవంత్ మాత్రం వెయ్యి టీఎంసీలు చాలని అంటున్నారు. ఇది ద్రోహం కాదు?” అంటూ ప్రశ్నించారు. “2020లో గజేంద్ర షెకావత్‌కు రాసిన లేఖలో కేసీఆర్ 3000 టీఎంసీల డిమాండ్ చేశారు. నువ్వు వెయ్యి టీఎంసీలు చాలని ఎవరిచ్చిన హక్కుతో అంటున్నావు?” అని ధ్వజమెత్తారు.

“హరీష్ రావు పొడుగ్గా ఉంటే నీకు నష్టం ఏమిటి? నువ్వు పొట్టిగా ఉండి సీఎం కాలేదా?” “బాడీ షేమింగ్ గురించి మాట్లాడే స్థాయికి సీఎం హోదా దిగజారింది” అని విమర్శలు గుప్పించారు.

“దమ్ముంటే రేవంత్, హరీష్ రావుతో చర్చకు రావాలి. ఒక్కరే వస్తారు. నీవైపు ఎంతమందినైనా తీసుకురా. ఎవరికెంత జ్ఞానం ఉందో తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు. “పద్దెనిమిది నెలల్లో ఒక్క మంచి పని చేశావా రేవంత్ రెడ్డి? చేస్తే గుండు కొట్టించుకుంటాను” “బీజేపీకి ఎనిమిది ఎంపీలు గెలిపించి మోడీకి నజరానా ఇచ్చిన నువ్వే ఇప్పుడా బొమ్మలు పేల్చేది?” అని చెలరేగిపోయారు. “బంకచర్ల బంధాన్ని ఆపు రేవంత్ రెడ్డి. అవసరమైతే నీకు కేసీఆర్ సాయం చేస్తారు. అడుగు!” అంటూ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *