
- “ఇది అరాచక పాలనకు నిదర్శనం – ప్రజాస్వామ్యాన్ని ముంచేస్తున్నారు”
హైదరాబాద్, జూన్ 21 (విశ్వం న్యూస్): తెలంగాణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నోటీసు లేకుండా, స్పీకర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
“ఇది అప్రకటిత ఎమర్జెన్సీకి నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని, తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణిచివేయాలన్న కుట్రను నడుపుతోంది. ఇది సిగ్గు చేటు. అధికార దుర్వినియోగానికి నిదర్శనం,” అని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
ప్రజల నమ్మకాన్ని తుడిచిపెట్టే విధంగా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిపాటిని కాలరాసే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
- కౌశిక్ రెడ్డి అరెస్ట్… ప్రతిపక్షాలపై కక్ష సాధింపా?–
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్యలు ఇవే: మంత్రి శ్రీదేవి
“ఒక ప్రజా ప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయాలా?” అంటూ మంత్రి శ్రీదేవి తీవ్రంగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై స్పందించిన ఆమె, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు. “ఈరోజు కౌశిక్ రెడ్డి, రేపు ఇంకెవర్ని? ఇది స్పష్టంగా ఓపిక లేకపోవడానికీ, విభిన్న స్వరాలను అణిచివేయాలన్న కుట్రకీ నిదర్శనం. ప్రభుత్వ వ్యవహార శైలిలో సహనం ఉండాలి. శాసనసభ వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి. ప్రజల వాణిని అణిచివేయడమంటే, ప్రజాస్వామ్య మూలాలను నాశనం చేయడమే,” అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత రేకెత్తిస్తున్నాయి.
