ఫణిగిరిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

నాగారం, డిసెంబర్ 23 (విశ్వం న్యూస్) : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ఫణిగిరి గ్రామంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సిఎస్ఐ డేకేట్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవానికి గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ క్రీడోత్సవాలను ఫణిగిరి సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు.
జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం తొలి మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఉత్సాహభరిత నినాదాలతో ప్రేక్షకులు ఆటగాళ్లకు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ కాపరి జయరాజ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ భాను ప్రకాష్ యాదవ్, నాగారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మాజీ ఎంపీటీసీ జంపాల శోభా రాజు, శేఖర్ రెడ్డి, ముదిగొండ లాజరు, కుల పెద్దలు గోరంట్ల సామెల్, చిలుకూరి సామెల్, గోడిశాల అనిల్, సూర్యాపేట జిల్లా కబడ్డీ జాయింట్ సెక్రెటరీ చిలుకూరి మణికుమార్, ఈదుల కిరణ్ కుమార్, వార్డ్ మెంబర్స్ యాట సంతోష్, భాష మల్ల బాబురావు, అధ్యక్షులు సురేష్, ప్రదీప్, ప్రకాష్, సందీప్, యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొని క్రీడోత్సవానికి ప్రత్యేక శోభను చేకూర్చారు.