
హైదరాబాద్, డిసెంబర్ 22 (విశ్వం న్యూస్) : సీఎం రేవంత్ రెడ్డిను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుగోలు చేశారని, అలాగే రూ.50 లక్షల లంచం ఇస్తూ ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నోటిని మూసుకోవాలని, రాజకీయాల్లో ఆయన ప్రవర్తన దారుణంగా మారిందని విమర్శించారు.

పార్టీలు మారే విషయంలో రేవంత్ రెడ్డి అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరమని హరీశ్ రావు అన్నారు. గతంలో సోనియా గాంధీను ‘బలి దేవత’ అని, ఆ తర్వాత ‘దేవత’ అని కొనియాడిన చరిత్రను గుర్తు చేస్తూ, అవసరానికి అనుగుణంగా మాటలు మారుస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి రాజకీయ నాటకాలకు తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని హరీశ్ రావు హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతుందని ఆయన స్పష్టం చేశారు.