శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ కన్నుమూత

సిద్దిపేట, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని అహ్మదీపూర్ గ్రామానికి చెందిన శతాధిక మాతృమూర్తి ఆకుల ఐలమ్మ (102) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల రాజయ్య తల్లిగారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఐలమ్మ మారిన వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన చలి గాలుల కారణంగా గత పది రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురై ఇంట్లోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు అహ్మదీపూర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ఐలమ్మ మృతికి బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డా.కోవ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్ర రావు, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలియజేస్తూ ఆకుల రాజయ్యను ఫోన్‌లో పరామర్శించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని పార్టీల నాయకులు, వివిధ వర్గాల ప్రతినిధులు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలిపారు.