కేటీఆర్ చేతుల మీదుగా రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం రోజున హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ మరియు పార్టీ డైరీని ఆయన అధికారికంగా ఆవిష్కరిస్తారు.
అనంతరం 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.