కేసీఆర్‌కు నోటీసులు

కేసీఆర్‌కు నోటీసులు

హైదరాబాద్, జనవరి 29, 2026 (విశ్వం న్యూస్) : గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు లో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు సిట్ అధికారులు హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లగా, ఆయన అక్కడ లేనందున ఇంటి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

నోటీసుల ప్రకారం, రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ను విచారించనున్నట్లు సిట్ పేర్కొంది. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత కీలక దశకు చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *