బీఆర్ఎస్‌లోకి ఆరూరి రమేష్ రీ-ఎంట్రీ

బీఆర్ఎస్‌లోకి ఆరూరి రమేష్

హైదరాబాద్, జనవరి 28, 2026 (విశ్వం న్యూస్) : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు.

తాజాగా బీఆర్ఎస్‌లో చేరడంతో వరంగల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *