కబడ్డీ విజేతలకు
బహుమతి ప్రధానం
నాగారం, జనవరి 31 (విశ్వం న్యూస్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నాగారం బంగ్లా గ్రామంలో కీ.శే. భయ్యం మల్లయ్య – చీరిక లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన కబడ్డీ క్రీడోత్సవాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగారం పోలీస్ టీంకు గురువారం బహుమతులు అందజేశారు.
స్థానిక సర్పంచ్ భయ్యం సుజాత – వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, సర్కిల్ సీఐ నాగేశ్వరావుకు షీల్డ్ మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గ్రామస్థాయి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విజేతగా నిలిచిన నాగారం పోలీస్ టీంను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాగారం, తిరుమలగిరి ఎస్సైలు చిరంజీవి, వెంకట్ రెడ్డి, నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం, తుంగతుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొలిపాక సాయి కుమార్, నాగారం బంగ్లా ఉపసర్పంచ్ చీరిక నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు యల్మాకంటి సోమన్న, యూత్ కాంగ్రెస్ బంగ్లా అధ్యక్షులు గుద్దేటి సురేష్, టోర్నమెంట్ నిర్వాహకులు కన్నెబోయిన బుచ్చిబాబు, బంధారపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.