బండి భగీరథ్ లొంగుబాటు

బండి భగీరథ్ లొంగుబాటు

  • మూడు రోజులుగా ఉత్కంఠకు తెర… పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట స్వయంగా హాజరు

హైదరాబాద్, మే 16 (విశ్వం న్యూస్) : సంచలనం రేపిన వ్యవహారంలో బండి భగీరథ్ చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులు ఆయనను పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలికినట్టైంది.

ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న విచారణకు వస్తానని సమాచారం ఇచ్చినా, భగీరథ్ హాజరుకాలేదు. దీంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న వేళ, ఇవాళ ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయారు.

భగీరథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *