బాల్క సుమన్‌కు
14 రోజుల రిమాండ్

హైదరాబాద్, మే 31 (విశ్వం న్యూస్): బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను పోలీసులు చంచల్‌గూడా కేంద్ర కారాగారానికి తరలించారు. బాల్క సుమన్‌పై నమోదైన కేసులో విచారణ చేపట్టిన నాంపల్లి పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వాదనలు విన్న న్యాయస్థానం బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను చంచల్‌గూడా జైలుకు తరలించారు.
పోలీసులు బాల్క సుమన్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 326(జి), 351(3), 353(1)(బి), 55, 61(2)(ఎ)తో పాటు ప్రజా ఆస్తుల నష్టం నివారణ చట్టం (పీడీపీపీఏ) సెక్షన్-4 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజా ఆస్తుల ధ్వంసం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం.
బాల్క సుమన్‌కు రిమాండ్ విధించడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, చట్ట ప్రక్రియలో భాగంగానే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నమోదైన సెక్షన్లు
- BNS 326(జి)
- BNS 351(3)
- BNS 353(1)(బి)
- BNS 55
- BNS 61(2)(ఎ)
- PDPPA Act సెక్షన్-