ఆలయ మండపం కూలి 6 మంది మృతి

జూన్ 20 (విశ్వం న్యూస్): మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యశ్వాడి ప్రాంతంలోని హనుమాన్ ఆలయ మండపం అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ బాధితులను రక్షించే చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.