నార్సింగిలో వైఎస్సార్ జయంతి వేడుకలు

నార్సింగి, జూలై 8 (విశ్వం న్యూస్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా నార్సింగి వైఎస్సార్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ వింగ్ సంయుక్త కార్యదర్శి మనోజ్ పండ్ల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, సంఘమిత్ర విద్యాసంస్థల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, సంతోష్ కుమార్, మహేష్, బాలకోటిరెడ్డి, శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు.