నార్సింగిలో వైఎస్సార్ జయంతి వేడుకలు

నార్సింగిలో వైఎస్సార్ జయంతి వేడుకలు

నార్సింగి, జూలై 8 (విశ్వం న్యూస్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా నార్సింగి వైఎస్సార్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ వింగ్ సంయుక్త కార్యదర్శి మనోజ్ పండ్ల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, సంఘమిత్ర విద్యాసంస్థల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, సంతోష్ కుమార్, మహేష్, బాలకోటిరెడ్డి, శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొని మహానేతకు పుష్పాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *