రేవంత్ సర్వేలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌కు 78 సీట్లు!

రేవంత్ సర్వేలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌కు
78 సీట్లు!

హైదరాబాద్, జూలై 9 (విశ్వం న్యూస్): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన అంతర్గత సర్వేల్లోనే బీఆర్ఎస్‌కు 78 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజల మద్దతు కోల్పోయిన కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైందని, బీఆర్ఎస్‌కు ప్రజల ఆదరణ మరింత పెరుగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *