పోక్సో కేసు కక్షతో ఆరుగురి దారుణ హత్య

- బెయిల్‌పై వచ్చిన నిందితుడి రక్తపాతం.. బాలికపై మరోసారి అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం

షాబాద్, రంగారెడ్డి జిల్లా , జూలై 11 (విశ్వం న్యూస్): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి కక్షతో ఏకంగా ఆరుగురిని హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్‌పై మే 16న ఓ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మే 26న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్, తనపై పోక్సో కేసు నమోదు చేశారనే ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్ కుమార్ కట్టుకున్న భార్య, ఇద్దరు కుమారులతో పాటు, తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. మొదట దైవాలగూడలోని సొంత ఇంట్లో భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు.
హత్యలు చేసిన అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, “ఆరుగురిని చంపేశాను… నేను కూడా చనిపోతున్నాను” అని చెప్పినట్లు సమాచారం. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.