కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు

తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన ఉత్కంఠ

విశ్వo న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 25 : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్‌ నుంచి తొలగించడంతో పాటు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.

ఇద్దరు నేతల వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిటీ చైర్మన్‌ మల్లు రవి, వైస్‌ చైర్మన్‌ శ్యామ్ మోహన్ కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నివేదికను సమర్పించినట్లు సమాచారం.

తాజాగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలవనున్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడానికి దారితీసిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయంగా మరోసారి చర్చ మొదలైంది. కమిటీ చేసిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *