ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలి
ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలి
ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలి

టీఈ జేఏసీ పిలుపు
విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, ఆగస్టు 25: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు తిమ్మాపూర్, గన్నేరువరం యూనిట్ ఆధ్వర్యంలో ఎల్ఎండీ కాలనీలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయ ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఉద్యోగులకు ఉద్యమ కార్యాచరణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలైన పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ధర్నా, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం నిరసన, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్–మహాధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర నాయకులు మామిడి రమేష్, టీఎన్జీవో రాష్ట్ర నాయకులు రాగి శ్రీను, ఎన్టీపీఏ సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రరెడ్డి, పలువురు జిల్లా, యూనిట్ నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.