కరీంనగర్లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
కరీంనగర్లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

విశ్వం న్యూస్/కరీంనగర్, సెప్టెంబర్ 15:
దేశ ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-ఏ, కరీంనగర్ ఆధ్వర్యంలో వాసుదేవా హాస్పిటల్ అధినేత డా. ఎలగందల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్లు కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, అల్లాడి ఆనంద్ కుమార్, శ్రీరాముల శ్రీనివాస్‌లను శాలువాలతో సత్కరించారు. వారికి మెమెంటోలు, బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-2 సాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ పీఆర్వో పుల్లాల శ్యామ్, ఎల్ఐసీ ఎగ్జిక్యూటివ్ రత్నమాల, సిద్దిపేట డీఎస్పీ సదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం
లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ భవనంలో ఇంజనీర్స్ డే వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. సత్తు మల్లేష్ ముఖ్య అతిథిగా, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా, పలువురు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖ ఇంజనీర్లను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వల్లాల కృష్ణహరి, సైనేని నరేందర్, మయడం శివకాంత్ పటేల్, చిదుర సురేష్, పెద్ది విద్యాసాగర్, ముక్క శరత్ కృష్ణ, బట్టు వినోద్ పటేల్, మెతుకు కృష్ణ చైతన్య, ఐతా సూరజ్ కుమార్, కంభం ప్రసాద్, కోల అన్నారెడ్డి, గూడ ధర్మారెడ్డి, మెతుకు సత్యం, సింగమ రాజు, శ్రీరాముల శ్రీనివాస్, బండ సంతోష్, తంగెళ్లపల్లి రమేష్, కాదర్ల ప్రభాకర్, నర్ల సాయి కృష్ణ, గజవాడ ప్రభు తదితరులు పాల్గొన్నారు.