సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్

సుప్రీంకోర్టును
ఆశ్రయించిన
దానం నాగేందర్

విశ్వం న్యూస్/ హైదరాబాద్, సెప్టెంబర్ 19 :  దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శనివారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ బీఫాంపై గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. పార్టీ మారిన అంశంపై దాఖలైన అనర్హత పిటిషన్లను విచారించిన హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉండగా, దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన బీఆర్ఎస్ ఇప్పటికే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్ తరఫున పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు తమ వాదనను కూడా వినాలని కోరుతూ బీఆర్ఎస్ కేవియట్ దాఖలు చేసినట్లు సమాచారం.

దీంతో దానం నాగేందర్ అనర్హత వ్యవహారం తదుపరి దశలో సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *