సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : వైద్యుడు సజీవ దహనం (Video)

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : వైద్యుడు సజీవ దహనం (Video)

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : వైద్యుడు సజీవ దహనం
  • వోల్వో కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం..

విశ్వం న్యూస్/ సూర్యాపేట, సెప్టెంబర్ 20 :  సూర్యాపేట–ఖమ్మం 365 హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలమర్రి సమీపంలో వేగంగా వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని ఖమ్మంలోని మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *