రేవంత్ రెడ్డి పక్కన చేరడంపై కేటీఆర్ విమర్శలు

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రకాష్ గౌడ్ మోసం చేసి రేవంత్ రెడ్డి పక్కన చేరారని ఆరోపించారు. ఘన్సిమియా గూడ భూముల కోసమా, సుల్తాన్పూర్ కోసమా ఆయన వెళ్లారో తమకు తెలియదని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లుచ్చా పనులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. ప్రకాష్ గౌడ్ పని కూడా అయిపోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.