కరీంనగర్

హుజురాబాద్‌లో ఘనంగా గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు

హుజురాబాద్‌లో ఘనంగా గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు

  • ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని–మనోజ్ రావు

హుజురాబాద్ పట్టణంలో గ్యార్మి షరీఫ్ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన బండిపై చాదర్లను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తిశ్రద్ధలతో పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్లను సమర్పించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల్లో పాల్గొన్న హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని–మనోజ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, మత సామరస్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు భక్తి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ ఈద్గా అండ్ ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, సెక్రటరీ మహమ్మద్ అశ్వక్ ఆశు, కౌన్సిలర్లు మహమ్మద్ ఖాలీక్ హుస్సేన్, మొగిలి, సమ్మయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, పుణ్య–బాబు, కోఆప్షన్ సభ్యులు అలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *