ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా:అడిషనల్ కమిషనర్ సర్వీసెస్ గీత
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా:అడిషనల్ కమిషనర్ సర్వీసెస్ గీత

విశ్వం న్యూస్/కరీంనగర్, సెప్టెంబర్ 29 : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ (సర్వీసెస్) గీత తెలిపారు. కరీంనగర్‌లోని రాధా కాన్ఫరెన్స్ హాల్ హోటల్‌లో జరిగిన డిప్యూటీ కమిషనర్ ఎం. సుబ్రహ్మణ్యం పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి వివిధ డీపీసీ కమిటీలను ఏర్పాటు చేసి, అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు శాఖ తరఫున చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఏసీటీఓ, డీసీటీఓ, సీటీఓ, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్ వరకు పలు స్థాయిల్లో పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు.
తాను వరంగల్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సుబ్రహ్మణ్యం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో విశేషంగా కృషి చేశారని గీత గుర్తుచేశారు. ఇటీవల డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొంది కరీంనగర్‌కు వచ్చి నాలుగు నెలలు పనిచేసిన అనంతరం పదవీ విరమణ చేయడం అభినందనీయమన్నారు.
ఉద్యోగుల పదోన్నతులకు ప్రాధాన్యం
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులు, ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు, అడిషనల్ కమిషనర్ గీతతో పాటు సెక్షన్ సూపరింటెండెంట్లు చేసిన కృషి అభినందనీయమన్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల్లో ఎవరైనా పదవీ విరమణ చేసినప్పుడు వారికి ఘనంగా వీడ్కోలు పలకడం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు.
ఘనంగా సన్మానం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల జాయింట్ కమిషనర్ గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్ ఎం. సుబ్రహ్మణ్యం, డీసీటీఓ ముప్పిడి శ్రీనివాస్‌లను అడిషనల్ కమిషనర్ గీత, జాయింట్ కమిషనర్ గోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జగిత్యాల సీటీఓ కవిత, పెద్దపల్లి సీటీఓ చరణ్, సిరిసిల్ల సీటీఓ రాజేందర్, కరీంనగర్ సీటీఓ జై సత్యనారాయణ, మూర్తి వైష్ణవి, డీసీటీఓలు ప్రవీణ్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్, నాయకులు ఏ. అనిల్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ బారి, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.