నీటి సమస్యలు తప్పవు-జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

నీటి సమస్యలు తప్పవు-జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 30: మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో హైదరాబాద్ నగరానికి రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా లేకుండానే రానున్న ఎనిమిది నెలల పాటు నగర అవసరాలను తీర్చాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.

హైదరాబాద్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నీటి సమస్య తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. పటాన్‌చెరు నుంచి జూబ్లీహిల్స్ వరకు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడుతుందని వివరించారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 80 శాతం మేర నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడం, మరోవైపు మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో తగినంత నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో నీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ నీటి వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *