పారిశుద్ధ సమస్యపై అవగాహన ర్యాలీ నిర్వహించిన కార్పొరేటర్

పారిశుద్ధ సమస్యపై అవగాహన ర్యాలీ నిర్వహించిన కార్పొరేటర్

అంబర్ పేట, పిబ్రవరి 14 (విశ్వం న్యూస్) : బాగ్ అంబర్పేట్ డివిజన్ శ్రీనివాస నగర్ లో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, పారిశుద్ధ్య సమస్యపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేట్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వీధులలో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చిన రీతిలో రోడ్లపై చెత్త పడవేయకుండా, ఇంటింటికి వచ్చే స్వచ్ఛ ఆటోలోనే చెత్త వేయాలని, దీని ద్వారా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన ఆరోగ్యాలను కాపాడుకున్న వాళ్ళమవుతామని అవగాహన ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేశారు. డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, బిజెపి నాయకులు, ఆనంద్ యాదవ్ జిహెచ్ఎంసి. ఎస్ ఎఫ్ ఏ లు, ఆంజనేయులు, ఆదిల్, హరినాథ్, రాంకీ సంస్థ సూపర్వైజర్లు E.సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *