వీర జవాన్లకు నివాళులు అర్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గగన్ మహల్ శాఖ

వీర జవాన్లకు నివాళులు అర్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గగన్ మహల్ శాఖ

అంబర్ పేట, పిబ్రవరి 14 (విశ్వం న్యూస్) : పుల్వమా దాడులలో అమరులైన వీర జవాన్ లకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ జిల్లా గగన్ మహల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పుల్వామా దాడులలో వీరమరణం పొందిన వీర జవాన్లను స్మరించుకుంటూ ఏవి కళాశాలలో సెమినార్ నిర్వహించి వీడియో ప్రదర్శన, మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యానగర్ జిల్లా కన్వీనర్ హరి ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ రాజలింగం మాట్లాడుతూ భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచిన రోజు 2019 ఫిబ్రవరి 14, తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భరతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ఒక ఆత్మాహుతి దాడి చేసిన పనికి 40 మంది జవాన్లు అమరులైన రోజు జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడి తో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది.

భరతమాత ఒడిలో శాశ్వత నిద్రకు చేరుకున్నారు. శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సి అర్ పిఫ్ ) సిబ్బంది కాన్వాయ్‌ మీద ఆత్మాహుతి దాడి చేసి నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం. ఈ దాడిని ఖండిస్తూ పుల్వామా దాడి ఘటన మన దేశానికి ఒక చీకటి రోజు అంటూ అమరవీరులకు నేడు నివాళులు అర్పిస్తోంది. పాకిస్తాన్నీ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని. ఇదే వీర సైనికుల సేవలను స్మరించుకుంటూ దేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పండితులు భాస్కర్, నగర కార్యదర్శి కార్తీక్, జిల్లా లా ఫోరం కన్వీనర్ ప్రణయ్ నాయకులు రేవంత్, పాషా, కమాల్, త్రిలోక్, కృష్ణ వర్ధన్, జగన్, ప్రశాంత్, స్నేహిత్, వనిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *