రూ.1తో 2 లక్షల బీమా కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వందే

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్
తిమ్మాపూర్, పిబ్రవరి 18 (విశ్వం న్యూస్) : కేవలం నెలకు ఒక రూపాయి, రోజుకు ఒక రూపాయికి రెండు లక్షల బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని, దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అనునిత్యం ఆలోచన చేస్తూ, వారందరి అభ్యున్నతే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం విజయవంతమైన పాలన కొనసాగిస్తుందన్నారు, ప్రజలను అష్ట కష్టాలు పెట్టి, వారి జీవితాలతో చెలగాటమాడుతు, గోసపెట్టే దుర్మార్గపు రాష్ర్ట ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని, అలాంటి ప్రజా వ్యతిరేకబిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించే బిజెపి మోడీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు విజయాలు ఇంటింటికి చేరవేయాలని పిలుపు నిచ్చారు. శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశం అక్కడి శక్తి కేంద్ర అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావే శానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ.. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ పథకాలను , రాష్ట్రంలోని బిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి, ప్రతి ఇంటికి చేరే విధంగా చేసి, క్షేత్రస్థాయి లో పార్టీ నిబలోపేతం చేసే ఉద్దేశం తో శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు.
దేశంలోని మోడీ ప్రభుత్వం మొదటగా ప్రజా భద్రతకు పెద్ద పీట వేసిందని, అందులో భాగంగా వ్యక్తిగత భద్రతతో పాటు ఆరోగ్య భద్రతను కల్పించడానికి తగిన చర్యలు తీసుకుందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ద్వారా సంవత్సరానికి 330 రూపాయలు, సురక్ష బీమా యోజన పథకం ద్వారా 12 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చేసిందని, ఇట్టి పథకాలలో కేవలం ఒక్క రోజుకు ఒక్క రూపాయి కంటే తక్కువ, నెలకు ఒక్క రూపాయి తో రెండు రకాల పథకాలతో 2 లక్షలబీమా అవకాశం కల్పించడం చారిత్రకమైందన్నారు.ప్రజలఆరోగ్య భద్రత కోసం ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకు వచ్చి, ప్రతినెల 250 రూపాయలు 15 సంవత్సరాలు వరకు చెల్లిస్తే,తిరిగి ఆ పథకం ద్వారా ఐదు లక్షల పైచిలుకు మొత్తం మనకు అందేలా గొప్ప పథకాన్ని తీసుకువచ్చిందని,ఈ పథకం ఆడపిల్లలకు వరం లాంటిదన్నారు. అసంఘటిత కార్మికుల భద్రత కోసం ఈ శ్రమ్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు.
ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం అలాంటి పథకం ఏదైనా ఉందా? ప్రశ్నించారు.
గ్రామాల రోడ్డు నుండి దేశ బార్డర్ వరకు కేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ స్వలాభం, ఓట్ల కోసం కాంట్రాక్టర్ల మేలు కోసం ఇన్నేళ్లుపడరాని పాట్లు పడిందని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ,పథకాల కోసం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నేడుఐదు లక్షల కోట్ల అప్పుల మయంగా మార్చిందన్నారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పేర్లు మార్చి రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ సొమ్మొకడిది సోకొకడిది అనే విధంగా వ్యవహారం చేస్తుందని, తొమ్మిది సంవత్సరాల్లో కెసిఆర్ ప్రభుత్వం లెక్కలేని హామీలు, వాగ్దానాలుఇచ్చి ప్రజానీకాన్ని తీవ్రంగా మోసం చేసిందన్నారు. రైతులకు ఉచిత ఎరువులు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే వాగ్దానాలు హామీలు అనేకం ఉన్నాయని , వాటిని అమలు చేయకుండా సామాన్య ప్రజానీకాన్ని కెసిఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా చార్జీల పెంపులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని,,. అందుకు ఉదాహరణ పెట్రోల్ డీజిల్ ధరలే .. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలోనే డీజిల్ పెట్రోల్ పై పది రూపాయలు అధికంగా వసూలు చేయడమే ఇందుకునిదర్శనంగా నిలుస్తుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం అనేక పథకాలను తీసుకువచ్చిందని, బిజెపి శ్రేణులు పథకాలన్నిటిపై అవగాహన కలిగి ఉండాలని, కెసిఆర్ ప్రభుత్వ హామీలు వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైనందున ఆ విషయాలన్నింటినీ ప్రజలకు చేరవేసే విధంగా చేయాలని సూచించారు. అలాగేశక్తి కేంద్రాల పరిధిలోని పోలింగ్ బూతులను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బూట్ల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గడ్డం అరుణ్, శక్తి కేంద్ర అధ్యక్షులు రాజు యాదవ్, వేల్పుల మల్లేశం, బూత్ కమిటీ బాధ్యులు, స్థానిక గొల్లపల్లి ప్రజలు, పాల్గొన్నారు.