డీఎస్ కు అస్వస్థత

హైదరాబాద్, పిబ్రవరి 27 (విశ్వం న్యూస్) : టీఆర్ఎస్ మాజీ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి రెండు రోజులపాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేను. అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.