పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆర్
తిమ్మాపూర్, మార్చి 1 (విశ్వం న్యూస్) : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల తో పాటు గ్యాస్ ధరల ను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆరోపించారు. బుధవారం కరీంనగర్ లో జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ..
400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఎనిమిదేళ్ళ మోడీ ప్రభుత్వం పలు మార్లు పెంచుతూ సాన్యులపై బారమ్మోపుతుందన్నారు. నిన్నటి వరకు 1130 రూపాయలు ఉన్న గ్యాస్ ధర నేటి నుండి మరో 50 రూపాయలు పెంచడంతో 1180 రూపాయలకు పెరిగిందన్నారు. గతంలో పలు మార్లు డీజిల్, పెట్రోల్, గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, బిజెపికి తగిన గుణపాఠం చేప్పెల ప్రజలను చైత్యవంతులను తయారు చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే బిజెపి పేదలను దోచుకు తింటుందన్నారు. మోడీ మన్ కి బాత్ అంటే నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరచి గోస పెట్టడమేనా? ప్రజల గోస బిజెపి భరోసా యాత్ర అంటే ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానిలకు అమ్మడమేనా ఇదేనా మీరిచ్చే భరోసా? పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు బిఅర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *