హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాదయాత్ర

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైన రేవంత్ రెడ్డి పాదయాత్ర

హుజూరాబాద్, మార్చి 1 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన హుజురాబాద్ నియోజకవర్గంలో హాత్ సే హత్ జోడ పాదయాత్రలో భాగంగా తనుగుల గ్రామంలో ఇసుక మాఫియా ఇసుక క్వారీలను సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ మాఫియా సాండ్ మాఫియా గుండాయిజం తదితర మాఫియాలు చిల్లరేగుతున్నారని ఆరోపించారు. ప్రజా పాలన, ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి ఎన్నికలు రాజకీయాలు కబ్జాలంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బల్మూరు వెంకట్, ఐవైసి రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సంపత్,యువత తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *