సామాన్యుడి ఇంట్లో పేలిన గ్యాస్ బాంబు
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరలను పెంచడం శోచనీయం
కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నదా
మరి రాష్ట్ర ప్రభుత్వం ధరలు దించి మహిళలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాను
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం సిలిండర్ ధర పెంచితే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మహిళల కోసం 50 రూపాయలు తగ్గించినారు
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ప్రధాని మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా..??
పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్

గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు భారీగా పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది
కరీంనగర్, మార్చి 1 (విశ్వం న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణం తగ్గించాలని వైద్యుల అంజన్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చేదు బహుమతిని ఇచ్చారని పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారత దేశంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనైతికంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారని వైద్యుల అంజన్ కుమార్ ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే సామాన్యులు నడ్డి విరుస్తూ.. ముఖ్యంగా మహిళలపై ఆర్థిక భారం మోపుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచారని, ఇది అత్యంత విచారకరమని వైద్యుల అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో 410/- రూపాయలు ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం పెంచిన 50 రూపాయలతో కలిపి 1,155/- కు చేరుకుందని, ఈ ఎనిమిదేళ్ల కాలంలో దాదాపు 745 రూపాయలు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయని, ఇది సామాన్యుల నడ్డి విరవడమే అని వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. గృహ అవసరాల సిలిండర్ ధరను రూ. 50, వాణిజ్య అవసరాల సిలిండర్ ధరను రూ. 350 పెంచడం దారుణం అని వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ ధరలలో వెంటనే తగ్గించాలని వైద్యుల అంజన్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.