నీటి ఎద్దడి రాకుండా చూడాలి

మిషన్ భగీరథ అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దిశా నిర్దేశం
హైదరాబాద్, మార్చి 2 (విశ్వం న్యూస్) : రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటంకంగా నిర్వర్తించాల్సిన మంచినీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దిశా నిర్దేశం. ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కడా రాకుండా చూడాలి. అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పని చేయాలి. అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎండా కాలంలో కూడా నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలి. కరెంటు సమస్యలు వచ్చినా, నీటి సరఫరా ఆగవద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడండి. పంపుల మెయింటెనెన్స్ సరిగా చేయాలి. పైప్ లైన్ లీకేజీ లు లేకుండా జాగ్రత్త వహించాలి. ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ సరిగా చేయాలి. అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు అందాలి. ఈ సారి ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా, అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ సమావేశంలో ఈ ఎన్ సి, ceలు, ఈఈలు, అన్ని జిల్లాల ఎస్ ఈ లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.