ఉమెన్స్ డే స్పెషల్: నేటి సమాజంలో యువతకు భగవద్గీత ఎంతో అవసరం

ఉమెన్స్ డే స్పెషల్: నేటి సమాజంలో యువతకు భగవద్గీత ఎంతో అవసరం

భగవద్గీత మరియు యోగ ఆన్లైన్ అభ్యాసకుల ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : భగవద్గీత మరియు యోగ ఆన్లైన్ అభ్యాసకుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ లో హిమాయత్ నగర్ తాజ్ మహల్ హోటల్ లో ఘనంగా జరిగింది. వికారాబాద్ విశ్వహిందూ పరిషత్ మాతృశ్రీ సంయోజక, మరియు గీతా వాహిని ప్రధాన కార్యదర్శి కొత్తూరి జయశ్రీ గారు మరియు యోగా గురువులు బైంసా అంబేద్కర్ వెంకటేష్ గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాసమయంలో జూమ్ ఆప్ ద్వారా ప్రారంభమైన భగవద్గీత పారాయణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది అని జూమ్ ద్వారా 200 మంది వరకు పాల్గొంటున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా జమ్మికుంట పట్టణానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరియు ఆయా దూర ప్రాంతాలు మరియు విదేశాలలో ఉన్నవారు సైతం జూమ్ ద్వారా పాల్గొని భగవద్గీత విశిష్టతను తెలుసుకొని నేర్చుకుంటున్నారు. భగవద్గీత గురువు జయశ్రీ గారు తెలిపారు.

నేటి సమాజంలో భగవద్గీత అవసరం యువతకు మరియు అందరికీ కూడా ఎంతో అవసరం ఉందని తెలిపారు. మన సమాజంలో భగవద్గీతని ప్రచారం ఎంతో అవసరం ఉందని ప్రతి ఒక్కరూ గీత నేర్చుకొని వాళ్ల జీవితాలు క్రమబద్ధం చేసుకోవాలని తెలిపారు. యోగా గురువు వెంకటేష్ గారు మాట్లాడుతూ కరోనా వల్ల ఎంతో ప్రాణ నష్టము జరిగి ఉన్నది. యోగ సాధన వల్ల రాబోయే నష్టాలను దూరం చేసుకోవచ్చు అని తెలిపారు. యోగా సాధన చేయాలని తెలిపారు. భగవద్గీత అభ్యాసకులు కూడా వారి వారి మనోభావాల్ని భగవద్గీత నేర్చుకోవడం వల్ల వారి జీవితంలో వచ్చిన మార్పులని తెలిపారు. భగవద్గీత మరియు యోగ సాధకులు గురువులిద్దరి కి సన్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *