కోవర్టులతో నిండిపోతున్న జమ్మికుంట మండలం, హుజురాబాద్ నియోజకవర్గం

కోవర్టులతో నిండిపోతున్న జమ్మికుంట మండలం, హుజురాబాద్ నియోజకవర్గం

  • తాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మార్కెట్ చైర్మన్ అడగడం పట్ల ఆంతర్యం ఏమిటి..
  • జమ్మికుంటలో జామ్ అవుతున్న కొంతమంది కాంగ్రెస్ వెన్నుపోటు శ్రేణులు..
  • మొన్నచ్చిన వారు, డబ్బున్న వారికే బిఆర్ఎస్ పార్టీలో పదవులు దక్కుతాయా..?
  • బీఆర్ఎస్ సీనియర్లు, ఉద్యమకారులకు మొండి చేయ్యేనా..?
  • పదవుల కోసం నేనంటే నేనంటున్న నాయకులారా.. ఇటీవలే ఎమ్మెల్యే ఎన్నికల ఓటమిలో మీపాత్ర లేదా..?
  • ఇంకా ఈటెల రాజ్యాంగమే నడుస్తుంది అనేది నిజం కాదా.. దీని వెనుకాల ఉన్నది ఎవరు, మీరు కాదా..?
  • కేసీఆర్ వెంట నడిచి కేసులు, గాయాలపాలైన ఉద్యమకారులకు మొండిచెయ్యేనా..?
  • డబ్బున్న వారిదే రాజ్యమా.. ఉద్యమకారుల దగ్గర లేదనేనా..?

జమ్మికుంట, మార్చి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.. గత 6 నెలలుగా చైర్మన్ పదవి ఫిలప్ చేయకుండా కాలయాపన చేస్తున్న అధికారులు.. ఈ సందర్భంగా గత 6 నెలలుగా పదుల సంఖ్యలో ఆశావాహులు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటూ, ప్రదక్షిణలు చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు జమ్మికుంట మొత్తం రెస్టారెంట్స్,హోటల్స్ నిండుతున్న పరిస్థితి నెలకుంది. ఈ సందర్భంగా హంగులు ఆర్భాటాలు చేస్తూ ఏనాడు పార్టీలో లేనివారు, పదవులు అనుభవించిన వారు, డబ్బు ఉన్నవారు, నేనంటే నేనని ముందుకొస్తున్న సందర్భం కనబడుతుంది. 22 సంవత్సరాలుగా (టిఆర్ఎస్) బీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంబడి నడిచి, ఎన్నో పాదయాత్రలు చేసి గాయాలపాలై, కేసులు పెట్టుకుని, ధర్నాలు రాస్తారోకోలు చేసిన ఉద్యమకారుల పరిస్థితి ఏమిటని అంటున్నారు. నిన్న మొన్న టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి, ఏనాడు టిఆర్ఎస్ పార్టీలో పని చేయనివారు, డబ్బున్న వారు, ప్రజాప్రతినిధులుగా కుంభకోణాలు చేసి సస్పెండ్ అయినవారు, ప్రజాప్రతినిధిగా ఉన్నవారు తన కుటుంబ సభ్యులకు, అనుచరులకు మార్కెట్ చైర్మన్ అడగడం పట్ల ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ చైర్మన్ పదవి అంటే భారతదేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు, ప్రజలకు సేవ చేసే పదవి కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తదితరులు క్రమశిక్షణ కలిగిన పార్టీ కోసం, క్రమశిక్షణ కలిగి పార్టీ పుట్టినప్పటి (2001) నుండి ఉన్న సీనియర్ ఉద్యమకారులకే మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని అంటున్నారు. బీఆర్ ఎస్ పార్టీ కోసం, ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం పనిచేసిన వారికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సి మహిళకు కేటాయించాలని జమ్మికుంట ప్రజానీకం, రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు ఊహగాహనాలు నిలబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *