సాత్విక్ మరణం కార్పొరేట్ విధ్యా సంస్థల హత్య : బలమూరి వెంకట్

సాత్విక్ మరణం కార్పొరేట్ విధ్యా సంస్థల హత్య : బలమూరి వెంకట్

  • తెలంగాణ రాష్ట్రం నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలను బహిష్కరించాలి
  • సంవత్సరానికి వందల సంఖ్యల్లో రాలిపోతున్న విద్యార్థుల
  • కార్పొరేట్ విద్యా సంస్థల విధ్యా ఒత్తిడే కారణం:ఇన్ఎస్ యుఐ

హైదరాబాద్, మార్చి 3 (విశ్వం న్యూస్) : నార్సింగి శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక అదే క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించిన ఎన్ ఎస్ యూ ఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్, రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్. ఈసందర్భంగా ఇన్ఎస్ యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ మాట్లాడుతూ ఈ ఘటనపై విధ్యాశాఖ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత మంగళవారం రాత్రి నార్సింగి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అధ్యాపకుల ఒత్తిడికి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ కుటుంబ సభ్యులను శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సంవత్సరానికి పదుల సంఖ్యలో ఈ కార్పొరేట్ విద్యాసంస్థలలో అభం శుభం తెలియని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్రలో ఉన్న విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవడంలో విఫలమైయ్యారని దుయ్యబట్టారు.సాత్విక్ ని వేధించిన శ్రీ చైతన్య యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని, వారిపై హత్య కేసు నమోదు చేసే వరకు ఇన్ ఎస్ యు ఐ పోరాటం చేస్తోందని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు మానసిక ధైర్యం కలిపించేలా ఆత్మహత్య, హత్యలను అరికట్టేందుకు ప్రణాళిక ఏర్పాటు చేయాలని, నిపుణుల చేత కౌన్సిలింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు కాట సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ యాదవ్ కార్యదర్శి ఉదయ్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు జిజో జాన్సన్, ఫరూఖ్ నగర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ కేశంపేట్ మండల అధ్యక్షుడు శివ గౌడ్ , కొందుర్గ్ అధ్యక్షుడు ఆవుల శ్రీకాంత్, సాబేర్, ప్రశాంత్, సందీప్, సామి, ఇంతియాజ్, దర్శన్ ,ఇంద్రారెడ్డి, ఆదర్శ్, విక్కి, స్థానిక నాయకులు యువత తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *