వంట గ్యాస్ ధర పెంపులపై బీ ఆర్ఎస్ సిలిండర్లతో నిరసన

వంట గ్యాస్ ధర పెంపులపై బీ ఆర్ఎస్ సిలిండర్లతో నిరసన

గోవిందరావుపేట, మార్చి 3 (విశ్వం న్యూస్) : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంపుదలపై ములుగు జిల్లా బీ ఆర్ఎస్ అధ్యక్షులు కుసుమ జగదీష్ పిలుపుమేరకు శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఖాలీ సిలిండర్లతో బీ ఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షులు సురపనేని సాయికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకే నెలలో నాలుగు సార్లు సిలిండర్ ధరలను పెంచడం ఎంతవరకు సభ బణి ఆయన బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ వంటి నిత్యవసర వస్తువులపై ధరలు వెంటనే తగ్గించాలని. ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ ఎండి బాబర్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకిన పెళ్లి రమేష్, నామ్ పూర్ణ, మచ్చాపూర్ సర్పంచ్ రేగూరి రవీందర్ రెడ్డి, చల్వాయి సర్పంచ్ ఈ సం సమ్మయ్య, గట్టయ్య, రుద్ర బోయిన మల్లేశం, గోవిందరావుపేట మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి, రైతు సంఘం అధ్యక్షుడు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *