నాడు వక్ఫ్ భూమి కానిది-నేడు వక్ఫ్ భూమి ఎలా అయ్యింది

నాడు వక్ఫ్ భూమి కానిది-నేడు వక్ఫ్ భూమి ఎలా అయ్యింది

  • జీవో నెంబర్ 15 తో 7000 కుటుంబాల బ్రతుకులు ఆగం
  • టాక్స్లు ఇన్నిరోజులు ఎలా కట్టించుకున్నారు
  • టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్) : ఆపద సమయంలో ఉపయోగపడుతుందనే ముందుచూపుతో కష్టపడి సంపాదించిన దానంత భూమిపై పెట్టి స్థిరపడ్డారని సంతోషించేలోపు ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలు, బాధ్యతారాహిత్యమైన జీవోలతో సగటు జీవి బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పూర్వమే గ్రామ పంచాయతీగా ఉండి నేడు కార్పొరేషన్ స్థాయికి అభివృద్ధి చెందిన బోడుప్పల్ లోని 7000 కుటుంబాల బ్రతుకులను ఆగం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 15 ను నిరసిస్తూ బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పడిన లేఔట్లలో పైసా పైసా కూడా పెట్టుకుని ప్లాట్లు కొన్నవారు, ఇది ప్రభుత్వ భూమి మీది కాదంటే ఎటు పోతారని ఆయన ప్రశ్నించారు. దాదాపు 7000 కుటుంబాలు గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ట్యాక్స్లు కడుతూ ప్రభుత్వ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నారని, అప్పుడు వక్ఫ్ భూమి కానిది 2017లో వక్ఫ్ భూమిగా ఎలా మారిందని, తెలంగాణ ప్రభుత్వం లేనివారి కడుపు కొడుతూ ఉన్నవారికి దోచిపెడుతుందన్నారు. ఈ వక్ఫ్ బోర్డ్ సమస్యను ప్రభుత్వం మరో మారు ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి చూస్తుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, కార్పొరేటర్ కొత్త పాండు దుర్గమ్మ గౌడ్, మాజీ హైదరాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వరలక్ష్మి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ S.C సెల్ అధ్యక్షులు కందుకూరి నవీన్, విశ్వం గుప్త, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *