ఓటు చైతన్యంతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం

ఓటు చైతన్యంతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం

కాన్షిరాం సోదరి స్వర్ణ కౌర్
బోడుప్పల్, మార్చి 5 (విశ్వం న్యూస్) : అంబేద్కర్ ఆశయ సాధన సంఘం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహించబడుతుంది. ఈ ఆదివారం తో ఈ కార్యక్రమం 211 వారాలకు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాన్యశ్రీ కాన్సీరామ్ గారి సోదరి స్వర్ణకౌర్ గారు హాజరై అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత బహుజన సమాజ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి మన సమాజం నుండి రావడం మనం చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మహనీయులను ప్రతివారం స్మరించుకునే కార్యక్రమం చేపట్టడం గొప్ప అభినందనీయమైన కార్యక్రమం అని తెలిపారు. మాన్యశ్రీ కాన్సీరామ్ గారు అంబేద్కర్ గారు సూచించిన బోధించు, సమీకరించు, పోరాడు మూల సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని బహుజన సమాజాన్ని ఏకం చేసి రాజ్యాధికారం సాధించిన గొప్ప నేతని కొనియాడారు. బహుజనులు రాజ్యాధికారం సాధించాలంటే అది ఒక ఓటు చైతన్యంతోని మాత్రమే సాధ్యమైతుందని ఓటు చైతన్యం తీసుకువచ్చి రాజ్యాధికారాన్ని సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి మన కాన్సీరామ్ గారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కాన్సిరాం సిద్ధాంతాలను చదవాలని వారు సూచించిన మార్గంలో ప్రయాణించి నవ సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. బోడుప్పల్లో చేపట్టే మహనీయుల జ్ఞానమాల కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు మాట్లాడుతూ జ్ఞానమాల కార్యక్రమంలో కాన్షీరామ్ గారి కుటుంబ సభ్యులు పాల్గొనడం చాలా గొప్ప విషయమని వారి స్ఫూర్తిని మేం ఎల్లప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాన్సిరాం సోదరిని కుమారుడు రవీందర్ సింగ్, సోదరుడి కుమారుడు లగ్వీర్ సింగ్, బోడుప్పల్ మాజీ ఎంపిటిసి నత్తి జంగమ్మ జ్ఞాన ప్రచార సభ అధ్యక్షులునల్ల బాబు,ప్రమోద్ కుమార్. భూ పోరాట సమితి అధ్యక్షులు బుగ్గ మైసయ్య, మైసగళ్ల బాలయ్య, రాపోలు శ్రీరాములు,కామగల బాబు, నత్తి విజయ్, ఎర్ర మైసిగారి జంగయ్య ,మందుల సూర్య కిరణ్, మైసగళ్ళ జానీ కుమార్, ఏకలవ్య సంఘం అధ్యక్షులు శ్రీరాముల జ్ఞానేశ్వర్, ఈతకోట గోపాలకృష్ణ జి యాకయ్య , డ్రైవర్ సంఘ అధ్యక్షులు ఏసు రాజు, బండారి సాయి, వై శ్రీనివాస్, కంచి సతీష్, నాసిక్ ప్రభాకర్, జై భీమ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *