పీర్జాదిగూడలో గౌతం అడ్వాన్స్ డ్ ఫిజియోథెరపీ కైరో సెంటర్ ప్రారంభం

పీర్జాదిగూడలో గౌతం అడ్వాన్స్ డ్ ఫిజియోథెరపీ కైరో సెంటర్ ప్రారంభం

  • అతిథులుగా గ్రంధాలయ చైర్మన్, పిఎంసి అధ్యక్షులు డి డి ఆర్
  • కార్పొరేటర్ సుమలత సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభం
  • డాక్టర్ రమేష్ ఇమ్మడి పిటి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ సెంటర్

పీర్జాదిగూడ, మార్చి 11 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ కార్పొరేషన్ మల్లికార్జున్ నగర్, బోడుప్పల్ కార్పొరేషన్ మెయిన్ రోడ్ లోని డిడిఆర్ బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన డాక్టర్ రమేష్ ఇమ్మడి పిటి ఆధ్వర్యంలో గౌతమ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ కైరో సెంటర్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ పి ఎం సి అధ్యక్షులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుమలత సత్యనారాయణల చేతుల మీదుగా ఫిజియోథెరపీ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో విటమిన్ డెఫిషియన్సీ, సమాజంలోని వాతావరణంలో మార్పులు, అదే విధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు, దుమ్ముదూలి తదితర వాటివల్ల అనారోగ్యాలు అదేవిధంగా ఎన్నో ఆక్సిడెంట్లకు గురై ఇబ్బంది పడుతున్న జంట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ఈ ఫిజియోథెరపీ సెంటర్ బాగా ఉపయోగపడుతుందని, డాక్టర్ రమేష్ ఇమ్మడి పిటి ఆధ్వర్యంలో మల్లికార్జున నగర్ లో రెండు కార్పొరేషన్ల మధ్య ఈ హాస్పిటల్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ హాస్పిటల్ కి చేదోడువాదోడుగా సహాయ సహకారలను అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ ఫిజియోథెరపీ సెంటర్ కు సంబంధించిన, అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గౌతమ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ సెంటర్ ను సంప్రదించాలని కోరారు. డాక్టర్ రమేష్ ఇమ్మడి మాట్లాడుతూ మా గౌతమ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ కైరో రిహబ్ సెంటర్లో ఎలాంటి మందులు లేకుండానే మీ అనారోగ్యాలను నయం చేయబడును.

అదేవిధంగా నడుం నొప్పులు భుజం నొప్పి మెడ నొప్పులు మోకాలు కీళ్ల నొప్పులు పెరాలసిస్ తదితర రోగాలకు ఎలాంటి మందులు లేకుండానే ఫిజియోథెరపీ మరి కైరో చికిత్స ద్వారా తగ్గించబడును అని పేర్కొన్నారు అదేవిధంగా మా క్లినిక్ రాలేని వారికి ఇంటి వద్దనే ఫిజియోథెరపీ చికిత్స చేసే అవకాశం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు హోం విజిట్ అ అవైలబుల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ మధ్యలో ఈ హాస్పిటల్ నెలకొల్పడానికి నిరుపేద వర్గాలకు చెందిన ప్రజలకు ఫిజియోథెరపీ అవసరం ఉన్నవారికి మా క్లినిక్ దోహదపడుతుందని వారి కోసం ప్రత్యేకంగా ఈ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు అత్యంత ఆధునికమైన చికిత్స తో పాటు అతి తక్కువ ధరలకు అందుబాటులో చికిత్స ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్ ఎమ్మెస్ సురేష్ బాబు, సైబరాబాద్ అడిషనల్ డీజీపీ ఎస్ ఓ టి పి.నారాయణ, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ పి విజయ్ కుమార్, రఫా ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ వీరయ్య(జాషువా) డాక్టర్ సంగీత శ్రీనివాస్ గౌడ్, పాస్టర్ సురేందర్ పాల్, ఇమ్మడి వీరబాబు, కిన్నెర రవీందర్ చీనిగల్ బాబు, వినయ్ కుమార్, సీనియర్ ఫీజియోథెరపీ డాక్టర్ జైపాల్ డాక్టర్, సుశీల్, డాక్టర్లు, సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *