కీ.శే జగన్మోహన్ చారి కుటుంబానికి అండగా కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్

దశదిన కర్మకు హాజరై 10 వేల రూపాయల ఆర్థిక సాయం
పీర్జాదిగూడ, మార్చి 20 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ విహారిక కాలనీ వాసులు ఇటీవలే మరణించిన కీర్తిశేషులు జగన్మోహన్ చారి దశ దిన కర్మ పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులకు స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ల ఆదేశాల మేరకు మేడిపల్లి మాజీ ఉపసర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి రవీందర్ చేతుల మీదుగా రూ. 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా బండారు రవీందర్ మాట్లాడుతూ ఈరోజు జగన్మోహన్ చారి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో విహారిక కాలనీ అధ్యక్షులు ఏవి రమణారెడ్డి, జనరల్ సెక్రటరీ సంగే పాక సుధాకర్, కాలనీ వాసులు రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్ యూత్ అధ్యక్షుడు బత్తి సుమిత్ పాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తదితరులు హాజరయ్యారు.

