దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకం వర్తింప చేయాలి

దళిత జర్నలిస్టులకు దళిత బంధు
పథకం వర్తింప చేయాలి

  • ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
  • తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్
  • రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్

మంచిర్యాల, మార్చి 21 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు ఆమాలు చేయాలని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న వర్కింగ్ దళిత జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నీలాకాంతేశ్వర కాంప్లెక్స్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ పత్రికలు చానల్లో ఏండ్ల తరబడి అనేకమంది దళిత గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని తెలిపారు. వారంతా ఆర్థిక స్తోమత లేక పత్రిక యజమాన్యాల దోపిడీ భరించలేక ప్రభుత్వాల భరోసా లేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా జర్నలిస్టులు తెలిపారుకీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడి అధికారంలోకి ఇచ్చిన తరువాత జర్నలిస్టులకు అనేకమైన హామీలు ఇచ్చిందని ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన జర్నలిస్టుల యూనియన్లు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పత్రికల్లో చానల్లో దళిత గిరిజన జర్నలిస్టులుగా పనిచేస్తూ ఆర్థిక స్తోమత లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు అమలు చేయాలని, ఇండ్లు లేదా ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వర్కింగ్ దళిత జర్నలిస్టులకు గిరిజన జర్నలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొంతమంది ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం అందజేశామని ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని ప్రభుత్వం స్పందించి రెండో విడత దళిత బంధు పథకంలో దళిత జర్నలిస్టులను గుర్తించి అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బందు కోసం తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించనున్నట్లుగా తెలిపారు.

తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్
మంచిర్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరేల్లి మల్లేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బంధల రాజశేఖర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఓరుగంటి సత్యం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల శ్రీధర్, జిల్లా కోశాధికారిగా కొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా కలువల శంకర్, ఉప్పులేటి రవి, కలువల అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఏ నరేష్, మోరే రవీందర్, మాసు శివ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *