ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

గోవిందరావుపేట, డిసెంబర్ 28 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట బస్టాండ్ సెంటర్లో ఆ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రపు వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు, ఎంపీటీసీ చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సర్పంచులు ముద్దబోయిన రాము, భూక్య సుక్య, ఉపసర్పంచులు కట్ల జనార్దన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, దేపాక కృష్ణ, యనమద్దిని శ్రీను, గ్రామ అధ్యక్షులు బద్దం లింగారెడ్డి, బొల్లు కుమార్, పాలెం యాదగిరి, వేల్పుగొండ ప్రకాష్, పాడియా రాజు, గణపాక సుధాకర్, గోపిదాసు రజిత, మిరియాల లక్ష్మీ, కోరం రామ్మోహన్, మున్నా, తండా రవి, చెరుకుల సురేష్, జక్కు రణదీప్, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, దేవరపెళ్లి మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు