ఘనంగా ఎస్ఎఫ్ఐ 53వ అవీర్భావ దినోత్సవవేడుకలు

ఘనంగా ఎస్ఎఫ్ఐ 53వ అవీర్భావ దినోత్సవవేడుకలు

ములుగు, డిసెంబర్ 29, (విశ్వం న్యూస్) : భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ 53 ఆవిర్భావ దినోత్సవం ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ సభ్యులు గూగుల్ రమేష్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాదు రాకేష్ మాట్లాడుతూ 1970 డిసెంబర్ 28 నుండి 30వ తేదీల్లో కేరళ రాష్ట్రం త్రివేండ్రం ప్రాంతంలో అధ్యయనం- పోరాటం అనే నినాదంతో స్వాతంత్రం,ప్రజాస్వామ్యం,సోషలిజం* అనే లక్ష్యాలతో 11 మంది సభ్యులతో ఎస్ఎఫ్ఐ ఏర్పడిందని ఆయన తెలిపారు . ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించి 53 సంవత్సరాలు అయిందని వారు తెలిపారు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించిందని భవిష్యత్తులో విద్యారంగం పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని, వారు తెలిపారు.మా దేహాలు ముక్కలైన , ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, అనే నినాదంతో ముందుకు కొనసాగుతుందని వారు అన్నారు.ఈ దేశంలో ప్రతి పేదవాడికి ధనికుడికి ఒకే రకమైన విద్య అందాలని, అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంతో ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మోర లక్ష్మణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ జోడు సాయిచరణ్ కమిటీ సభ్యులు రవితేజ, బాలు, తదితరులు పాల్గొన్నారు.

జెండావిష్కరిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *