ఆరోగ్య‘మహిళ‘

వీణవంక, మార్చి 29 (విశ్వం న్యూస్) : ఈరోజు వీణవంక మండలం కేంద్రంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక కర్ణన్, మరియు మండల ప్రత్యేక అధికారి శ్రీ పవన్ కుమార్, మహిళా ఆరోగ్య స్పెషల్ ఆఫీసర్ పద్మావతి, వైద్య సిబ్బంది, ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు సంబంధించిన మహిళలు వారి ఆరోగ్య పరిస్థితి నిమిత్తం చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయుంచుకున్నారు.
