అడ్డంగా దొరికేసిననాగ చైతన్య

హైదరాబాద్:, మార్చి 28 (విశ్వం న్యూస్) : నాగ చైతన్యకు సంబంధించిన ఓ పిక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగచైతన్య, శోభిత కలసి లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరి డేటింగ్ మేటర్ మళ్లీ తెరపైకి వచ్చింది.

వీరిద్దరూ కలసి లండన్ లో జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటో అది. అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత కూర్చున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతోంది.
