
- ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
- రాముని కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్తజనం

ఇల్లంతకుంట, మార్చి 30 (విశ్వం న్యూస్) : ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఆశేష భక్త జనవాహిని నడుమ కన్నులపండుగగా సాగింది. కళ్యాణానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించారు.

కళ్యాణా మహోత్సవానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్పర్సన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఆర్డీఓ హరిసింగ్ జడ్పిటిసి శ్రీరామ్ శ్యా మ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
