అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా
శ్రీ సీతారాముల కల్యాణం

  • ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించిన శివ సాయినగర్ వాసులు
  • రాముని కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్తజనం

బండ్లగూడ జాగీర్, మార్చి 30 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో శ్రీ జ్ఞాన వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఆశేష భక్త జనవాహిని నడుమ కన్నులపండుగగా సాగింది. వైభంగా ఏర్పాట్లు… సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అందంగా తీర్చి దిద్దారు. భ‌క్త‌జ‌నుల అధికముగా పాల్గొన్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా శ్రీవారి ఆలయ కమిటీ పాలకవర్గం, సభ్యులు ప్రత్యేక దర్శనానికి భారీ ఏర్పాటు చేశారు. తలారి చంద్రశేఖర్, కార్పొరేటర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ముత్యాల తలంబ్రాలు మరియు ముత్యాల హారాలను శివ సాయినగర్ వాసులు సమర్పించారు. దేవాలయ భద్రతకు సీసీటీవీ కెమెరాలు డొనేట్ చెయ్యడం జరిగింది. కెమెరాలను కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ ప్రారంభించారు.

అన్నదాన కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి గణేష్, తలారి రమేష్, శివ సాయినగర్ అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, సభ్యులు పార్శి వెంకట్, గోవర్ధన్ రెడ్డి, సత్య, రంగస్వామి, కిషోర్, రవి చారి, నరేష్ దంపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *