కరీంనగర్ లో ఐయంఏ
వైద్యుల మహా ధర్నా
తిమ్మాపూర్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన ఆరోగ్య బిల్లులో మార్పు కొరకు, ఐయంఏ కేంద్రం ఢిల్లీ పిలుపు మేరకు, ఉద్యమిస్తున్న రాజస్థాన్ రాష్ట్ర ఐయంఏ వైద్యులకు సంఘీభావంగా ఐయంఏ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా వద్ద ఐయంఏ వైద్యులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐయంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డా. రామ్ కిరణ్ పొలాస మాట్లాడుతూ ఇలాంటి లోపభూయిష్టమైన చట్టాలను అమలు చేయడం సరి కాదని వీటి వల్ల ప్రజలు నష్టపోతారని, వారికి సరైన సమయంలో అత్యవసర చికిత్స అందక వైద్యం అందించాల్సిన విలువైన సమయాన్ని సరైన వసతులు లేని హాస్పి టల్స్ ఉచిత వైద్యం పేరిట ఉంచి కాలయాపన చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అని తెలిపారు. దీనికి బదులుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునిక సౌకర్యాలతో సమృద్ధి పరిచి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని, బడ్జెట్లో ఆరోగ్యానికి ఎక్కువ ధనం కెటాయించాలని, అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తూ, మళ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆచరణ సాధ్యంకాని హామీ లను, పనులను, ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసి, సమాజంలో చిచ్చు పెట్టవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి డా. వెంకట్ రెడ్డి, డా. మహే ష్, డా భాగ్యరెడ్డి, డా అలీం, డా. రాజేశ్వర్, డా. ఝూన్సీ, డా శేష శైలజ, డా. మానసతో పాటు సుమారు 150 మంది వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.