బల్మూరు వెంకట్ అక్రమంగా
అరెస్టు నిరసనగా

ప్రశ్నిస్తే కేసులు పెడతారా
హుజురాబాద్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : ఈరోజు నిన్న పదవ తరగతి ప్రశ్న పత్రం లీకేజ్ అయినందుకు నిరసనగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బల్మూరు వెంకట్ హైదరాబాదులో కార్యక్రమం చేస్తే అక్రమంగా అరెస్టు చేసి 14 రోజు రిమాండ్ విధించడం జరిగింది. నిరసనగా హుజురాబాద్ టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో కార్యక్రమంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రభుత్వం పనిగా అయిపోయింది. బల్మూర్ వెంకట్ విడుదల వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, మైనార్టీ సెల్ టౌన్ ఎండీ అఫ్సర్, మహిళ నాయకురాలు సుశీల, లావణ్య, మల్లేశ్వరి, రామారావు, సంపత్, రాకేష్ రెడ్డి, సందీప్ కుమార్, సలీం, విజేందర్, ఐలయ్య, దయాకర్, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
